ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో సిఎం రేవంత్‌ రెడ్డి ఇంటర్వ్యూ... నేడే!

తెలంగాణ ఏర్పడిన పదేళ్ళ తర్వాత కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తెచ్చిన వ్యక్తి రేవంత్‌ రెడ్డి. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా నేడు మీడియా ఇంటర్వ్యూలో పాల్గొనబోతున్నారు. ఈరోజు సాయంత్రం 7 గంటలకు ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానల్ సంపాదకులు వేమూరి రాధాకృష్ణ ఆయనను ఇంటర్వ్యూ చేయబోతున్నారు. 

సిఎం రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టి నెలరోజులు కాకముందే ప్రభుత్వంపై, పార్టీపై పట్టు సాధించిన్నట్లే కనిపిస్తున్నారు. కానీ ఆయన ముందు అనేక రాజకీయ, ఆర్ధిక సవాళ్ళున్నాయి. వాటన్నిటినీ ఎదుర్కొంటూ ప్రభుత్వం నడిపించడమే చాలా కష్టం. 

ఇవిగాక కేవలం ఐదుగురు అదనపు ఎమ్మెల్యేల బలంతో నడుస్తున్న రేవంత్‌ ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం పొంచే ఉంది ఈ పరిస్థితులలో ప్రజా రంజకంగా పరిపాలన చేయడం, రాష్ట్రాన్ని అభివృధ్డి పధంలో నడిపించడం ఇంకా కష్టం. 

కనుక సిఎం రేవంత్‌ రెడ్డి ఈ సమస్యలను, సవాళ్ళని అన్నిటినీ ఏవిదంగా ఎదుర్కోగలమని అనుకొంటున్నారు? తన ప్రభుత్వం కూలిపోకుండా కాపాడుకోవడానికి ఆయన ఏమి చేయబోతున్నారు? అని వేమూరి రాధాకృష్ణ మొహమాటం లేకుండా సూటిగా ప్రశ్నించబోతున్నారు. కనుక ఈరోజు ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానల్లో ఈరోజు సాయంత్రం 7 గంటలకు ప్రసారం కాబోయే సిఎం రేవంత్‌ రెడ్డి ఇంటర్వ్యూ చాలా ఆసక్తికరంగా సాగబోతోంది.