శనివారం హైదరాబాద్, తెలంగాణ భవన్‌లో పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలతో మాజీ మంత్రి హరీష్ రావు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వారికి ఓ శుభవార్త చెప్పారు.
ఇటీవల తుంటి ఎముక మార్పిడి శస్త్ర చేయించుకుని ఇంటివద్దే విశ్రాంతి తీసుకొంటున్న మాజీ సిఎం కేసీఆర్ ఇప్పుడు బాగా కోలుకొన్నారని, వైద్యుల సూచన మేరకు ఈ నెలంతా విశ్రాంతి తీసుకొని ఫిబ్రవరి నుంచి ప్రతీరోజూ తెలంగాణ భవన్‌కు వచ్చి పార్టీ కార్యకర్తలను కలుస్తారని హరీష్ రావు చెప్పారు. ఆ తర్వాత కేసీఆర్ జిల్లా పర్యటనలు చేస్తూ ప్రజల మద్యకు వస్తారని హరీష్ రావు చెప్పారు.
శాసనసభ ఎన్నికలలో ఓటమి బిఆర్ఎస్ పార్టీకి ఓ స్పీడ్ బ్రేకర్ వంటిదే. హామీలు అమలుచేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడే చేతులు ఎత్తేస్తోంది. కనుక లోక్‌సభ ఎన్నికలలో విజయం సాధించి బిఆర్ఎస్ పార్టీ సత్తా ఏమిటో చాటి చెపుదాం. పెద్దపల్లి లోక్‌సభ సీటుని దక్కించుకునేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలి,” అని హరీష్ రావు అన్నారు.