కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి భారత్ జోడో యాత్ర చేపట్టబోతున్నారు. ఇదివరకు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారత్ జోడో పాదయాత్ర విజయవంతంగా పూర్తి చేసిన రాహుల్ గాంధీ ఈసారి ఈశ్యాన్య రాష్ట్రమైన మణిపూర్ నుంచి దేశ ఆర్ధిక రాజధాని ముంబాయి వరకు భారత్ జోడో న్యాయ్ యాత్ర పేరిట పాదయాత్ర చేపట్టబోతున్నారు.
ఈ నెల 14 నుంచి ఈ యాత్ర ప్రారంభించి 67 రోజులలో 110 జిల్లాలు, 100 లోక్సభ నియోజకవర్గాలు, 337 శాసనసభ నియోజకవర్గాల మీదుగా మొత్తం 6,700 కిమీ పాదయాత్ర చేస్తూ ముంబయిలో ముగిస్తారు.
భారత్ జోడో యాత్ర చేసినందునే దక్షిణాదిన కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ పుంజుకొని అధికారంలోకి రాగలిగిందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. కనుక నాలుగు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు మొదలయ్యేలోగా ఈ పాదయాత్ర కూడా పూర్తి చేసినట్లయితే కాంగ్రెస్ విజయం సాధిస్తుందని భావిస్తున్నట్లున్నారు.