పురాతన భవన సముదాయంలో కొనసాగుతున్న తెలంగాణ హైకోర్టుకు నూతన భవనాలు నిర్మించాలనే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ రాధే అభ్యర్ధనపై సిఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించి, రంగారెడ్డి జిల్లా, రాజేంద్రనగర్ వద్ద భూమిని కేటాయిస్తానని ఇటీవల మాట ఇచ్చారు.
ఆ ప్రకారమే అక్కడ 100 ఎకరాలు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నేడు జీవో (నంబర్:55) జారీ చేసింది. రాజేంద్రనగర్ మండలంలోని బుద్వేల్, ప్రేమావతి పేటలో కొత్త హైకోర్టు భవన సముదాయం నిర్మించబడుతుంది.
కనుక రాజేంద్రనగర్ మండలం పరిధిలో అన్ని ప్రాంతాలు, వాటి చుట్టుపక్కల ప్రాంతాలలో భూములకు డిమాండ్ పెరుగుతుంది. కనుక రియల్ ఎస్టేట్ వ్యాపారం మరింత జోరు అందుకుంటుంది. ఈ కారణంగా ఆ ప్రాంతాలన్నీ శరవేగంగా అభివృద్ధి చెందనున్నాయి.