కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీలు అమలుచేయకపోతే బొంద పెట్టుడు ఖాయం

బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “కాంగ్రెస్ పార్టీ నోటికి వచ్చిన హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చింది. అదిచ్చిన హామీలన్నిటినీ 3 నెలల్లోగా నెరవేరుస్తామని చెప్పింది. ఇప్పటికే నెలరోజులు గడిచిపోయాయి. కాంగ్రెస్ పార్టీకి ఇంకా రెండు నెలలే గడువు మిగిలి ఉంది. ఆ తర్వాత మేము దానిని గట్టిగా నిలదీస్తాము. అది హామీలను అమలుచేయకపోతే ప్రజలను కూడా చైతన్యవంతం చేస్తాము. 

ఇప్పుడు అబద్దాలతోనే పరిపాలన కూడా కొనసాగించాలనుకొంటోంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీలు అమలుచేయలేకనే శ్వేతపత్రాల పేరుతో అబద్ధాలు చెపుతూ మాపై బురద జల్లాలని ప్రయత్నిస్తోంది. మేము అప్పులు చేయడం కాదు... రాష్ట్రానికి లక్షల కోట్ల సంపద సృష్టించాము. కాలువలలో పారుతున్న నీళ్ళు అబద్దామా? రాష్ట్రమంతా పండుతున్న పంటలు అబద్దామా? విద్యుత్ వెలుగులు అబద్దామా? మేము తొమ్మిదేళ్ళలో చేసిన అభివృద్ధి ఏమిటో కరపత్రాలలో ముద్రించి మా కార్యకర్తలకు ఇస్తున్నాము. వాటిని ప్రజలకు చూపి వారు వివరిస్తారు. అలాగే కాంగ్రెస్‌ ఇచ్చిన 420 అబద్దపు హామీలను కూడా ప్రజలకు వివరిస్తారు,” అంటూ బిఆర్ఎస్ పార్టీ ముద్రించిన ‘కాంగ్రెస్‌ 420 హామీలు’ అనే బుక్‌లెట్ విడుదల చేశారు. 

Video Courtecy: NV