దానం నాగేందర్‌కు వ్యతిరేకంగా ప్రజాభవన్‌ ఎదుట ధర్నా

బేగంపేట పరిధిలోని ప్రకాష్ నగర్‌ ఎక్స్‌టెన్షన్ కాలనీ వాసులు మంగళవారం ఉదయం ప్రజాభవన్‌ ఎదుట ఖైరతాబాద్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు, ప్లకార్డులు పట్టుకొని ధర్నా చేశారు. దానం నాగేందర్‌, అనుచరులు తమని రోజూ బెదిరిస్తూ తమ ఇళ్ళు, స్థలాలను కబ్జాచేయాలని ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. కనుక రాష్ట్ర ప్రభుత్వం దానం నాగేందర్‌పై పోలీస్ కేసు నమోదు చేయించి వారిపై చర్యలు చేపట్టాలని, దానం నాగేందర్‌, అనుచరుల నుంచి తమకు విముక్తి కల్పించాలని బాధితులు డిమాండ్ చేశారు.

అక్కడ ధర్నా చేస్తుండగా దానం నాగేందర్‌ అనుచరుడు  నాగరాజు ఇదంతా తన మొబైల్ ఫోన్‌తో వీడియో చిత్రీకరిస్తుండటం గమనించిన ఆందోళనకారులు అతనిని పట్టుకొని చితకబాది పోలీసులకు అప్పగించారు.

ఈసారి ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది కనుక బాధితులు ధైర్యంగా ప్రజాభవన్‌ ఎదుట దానం నాగేందర్‌కు వ్యతిరేకంగా గొంతు విప్పి మాట్లాడగలిగారు లేకుంటే ఆయన వేధింపులను భరిస్తూనే ఉండేవారేమో?