కేసీఆర్‌ లేని లోటు అప్పుడే కనబడుతోంది: జగదీష్ రెడ్డి

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, అప్పుల గురించి ప్రజలకు తెలియజేసేందుకు శ్వేతపత్రాలు విడుదల చేసి, విద్యుత్ ప్రాజెక్టులపై న్యాయ విచారణకు ఆదేశించడం, తాజాగా మంత్రుల బృందం కాళేశ్వరం ప్రాజెక్టుని సందర్శించి కేసీఆర్‌పై విమర్శలు గుప్పిస్తుండటంపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఘాటుగా స్పందించారు. 

“కేసీఆర్‌ లేని లోటు అప్పుడే ప్రజలకు కనబడుతోంది. కేసీఆర్‌ పాలనలో తెలంగాణ రాష్ట్రం ఏవిదంగా ఉండేది కాంగ్రెస్‌ పాలనలో ఏవిదంగా ఉందని అప్పుడే చర్చించుకొంటున్నారు. కనుక కాంగ్రెస్‌ మంత్రులు అబద్దాలు చెపుతూ ప్రజలను మభ్యపెట్టడం మానుకొని పరిపాలనపై దృష్టి పెట్టాలని కోరుతున్నాను. మీకు చేతనైతే కేసీఆర్‌ చేసిన దానిలో కనీసం 10 శాతమైన చేసేందుకు ప్రయత్నించండి. ప్రభుత్వం నడపడం మీకు చాతకాకపోతే అదే ప్రజలకు చెప్పి గౌరవంగా తప్పుకోండి. అంతేకాని అబద్దాలు చెపుతూ కాలక్షేపం చేయవద్దని కోరుతున్నాను,” అని జగదీష్ రెడ్డి హితవు పలికారు.