సంబంధిత వార్తలు

తెలంగాణ, పుదుచ్చేరిలకు గవర్నర్గా వ్యవహరిస్తున్న తమిళిసై సౌందరరాజన్ పదవులకు రాజీనామా చేసి త్వరలో జరుగబోయే లోక్సభ ఎన్నికలలో తన స్వరాష్ట్రమైన తమిళనాడు నుంచి పోటీ చేయబోతున్నారని ఇటీవల వార్తలు వచ్చాయి. అవి ఆమె దృష్టికి రావడంతో స్పందిస్తూ, “ఆ వార్తలు నిజం కావు. నేను ఎక్కడకీ వెళ్ళిపోవడం లేదు. తెలంగాణ గవర్నర్గా నేను చాలా సంతోషంగా ఉన్నాను. ప్రధాని నరేంద్రమోడీ, ఆ రఘురాముడి దయ వలన ఎటువంటి సమస్యలు లేకుండా నేను నా విధులు నిర్వర్తిస్తున్నాను. నేను ఢిల్లీకి వెళ్ళలేదు. ఎవరినీ కలవలేదు. వరదాబాధితులను పరామర్శించేందుకు తూత్తుకుడి వెళ్ళి వచ్చాను అంతే,” అని అన్నారు.