వాటిని మేము విజయవాడలో దాచలేదయ్యా రేవంత్‌ రెడ్డీ!

తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి నిన్న మీడియాతో మాట్లాడుతూ, “కేసీఆర్‌ మళ్ళీ తానే ముఖ్యమంత్రి అవుతానని నమ్మకంతో 22 లాండ్ క్రూజర్ వాహనాలు కొని విజయవాడలో దాచిపెట్టారు. కానీ పాపం ఓడిపోయారు. ప్రజాధనంతో కొన్న వాటన్నిటినీ హైదరాబాద్‌ రప్పించి ప్రజల ముందు ఉంచుతాం,” అన్నారు.   

దీనిపై బిఆర్ఎస్ నేత క్రిశాంక్ ఘాటుగా స్పందిస్తూ, “అయ్యా పబ్లిసిటీ మంత్రి రేవంత్‌ రెడ్డిగారూ.. ఇలాగ అబద్దాలు చెపుతూ మీ పదవికి అప్రదిష్ట తేవద్దు. 2022లోనే వాటిని కేసీఆర్‌ కాన్వాయ్ కోసం కొనుగోలు చేసి విజయవాడలోని ఓ వర్క్ షాపుకి పంపించామని హిందూ పత్రికలో వచ్చిన ఈ వార్తను చూడండి,” అంటూ ఆ వార్తా క్లిప్పింగ్ జత చేసి ట్వీట్‌ చేశారు. 

హిందూ పత్రికలో 2022, జూలై 24వ తేదీన వచ్చిన వార్తలో ఏముందంటే, సిఎం కేసీఆర్‌ కాన్వాయ్‌లో ఉపయోగిస్తున్న 10 ఫార్ట్యూన్ కార్లకు అదనంగా మరికొన్ని కార్లు రెండు రోజుల క్రితం హైదరాబాద్‌ నుంచి కార్గో విమానంలో గన్నవరం విమానాశ్రయంలో దిగాయి. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో విజయవాడ సమీపంలోని వీరపనేనిగూడెం వద్ద గల ఓ వర్క్ షాపుకు చేరుకొన్నాయి. అక్కడ వాటన్నిటికీ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలుగా మార్చబోతున్నారు. వాటితో కేసీఆర్‌ పర్యటనల కోసం రెండు బస్సులను కూడా బుల్లెట్ ప్రూఫ్ చేసేందుకు పంపిన్నట్లు సమాచారం.”