నేటి నుంచి జనవరి 6వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా పాలన కార్యక్రమం మొదలవుతుంది. దీనిలో భాగంగా ప్రతీ గ్రామంలో గ్రామసభలు నిర్వహించి, ప్రజల సమస్యలను వీలైనంత వరకు అక్కడికక్కడే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటారు. మిగిలినవాటికి వినతిపత్రాలు తీసుకుంటారు. వీటితో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేయబోతున్న ఆరు గ్యారంటీ పధకాలకు దరఖాస్తులను కూడా స్వీకరిస్తారు. ఈ గ్రామ సభల్లోనే లబ్ధిదారులను గుర్తించి ఎంపిక చేసేందుకు ప్రయత్నిస్తారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీ పధకాలను అమలుచేయడం కత్తిమీద సాము వంటిదే కనుక దీనిని అత్యంత జాగ్రత్తగా నిర్వహించాల్సి ఉంటుంది. కనుక ఉమ్మడి పది జిల్లాలకు ఐఏఎస్ అధికారులను నోడల్ ఆఫీసర్లుగా నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ వివరాలు...