అది వాళ్ళది కాదు తెలంగాణ ప్రజల స్వేదం: భట్టి

తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి గురించి తెలియజేస్తూ కాంగ్రెస్‌ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాలకు పోటీగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ తెలంగాణ భవన్‌లో స్వేదపత్రం విడుదల చేయడాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు. ఈరోజు ఆయన ఢిల్లీ బయలుదేరుతున్నప్పుడు విమానాశ్రయంలో మీడియా ప్రతినిధులు ఆయనను కలిసి స్వేద పత్రంపై స్పందించవలసిందిగా కోరారు. 

భట్టి విక్రమార్క స్పందిస్తూ, “భావించవచ్చు.-బావామరుదులు (కేటీఆర్‌-హరీష్ రావు) ఇద్దరూ చెమటోడ్చి తెలంగాణ కోసం ఆస్తులు కూడబెట్టినట్లు మాట్లాడుతున్నారు. అది వారి చెమట కాదు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల చెమట... వారి కష్టంతో వచ్చిన ఆదాయమే అదంతా. కానీ కేసీఆర్‌ చేసిన అప్పులన్నీ తీర్చాలంటే మళ్ళీ తెలంగాణ ప్రజలే చెమటోడ్చి చెల్లించాల్సి ఉంటుంది,” అని వ్యంగ్యంగా అన్నారు.