కాంగ్రెస్ సీనియర్ నేత విజయశాంతి ప్రభుత్వంలో, పార్టీలో కనిపించడం లేదు. సోషల్ మీడియాలో మాత్రమే కనిపిస్తున్నారు. ఆమె ప్రధానంగా బిఆర్ఎస్ పార్టీ, దాని జాతీయ అధ్యక్షుడు కేసీఆర్‌ని లక్ష్యంగా చేసుకొని వ్యంగ్యంగా ట్వీట్స్ చేస్తున్నారు.
తాజాగా ఆమె బిఆర్ఎస్‌కు లోక్‌సభ ఎన్నికలు చాలా చిన్నవంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. కేసీఆర్ నాయకత్వాన్ని దేశప్రజలు కోరుకొంటున్నారని ఇదివరకు డప్పు కొట్టుకొన్నారు కనుక ముందుగా ఆంధ్రా, మహారాష్ట్రాలలో తమ ‘భవిష్యత్ రహిత సమితి’ ఎంపీలను గెలిపించుకొంటారు.
తెలంగాణలో కాంగ్రెస్ గెలుచుకోగా మిగిలిన మూడు సీట్లు బిఆర్ఎస్ గెలుచుకొంటే, మిగిలిన రాష్ట్రాలలో 50 సీట్లు గెలుచుకొని జాతీయ రాజకీయాలలో కేసీఆర్ చక్రం తిప్పవచ్చని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.
విజయశాంతి బీజేపీని విడిచి లౌకికవాద కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ ఇంకా ప్రతీ ట్వీట్ కింద ‘హరహర మహాదేవ్’ అని వ్రాస్తున్నారు. ఆమెకు శివభక్తి ఎక్కువగా ఉన్నందునో లేక ఇంకా బీజేపీ వాసనలు ఆమెను ఇంకా అంటిపెట్టుకొని ఉన్నందునో తెలియదు.
బిఆర్ఎస్ పార్టీ గురించి విజయశాంతి ఏమన్నారో ఆమె మాటలలోనే...