త్వరలో జరుగబోయే లోక్‌సభ ఎన్నికలకు బిఆర్ఎస్ పార్టీ సిద్దం అవుతోంది. తెలంగాణలో 17 స్థానాలలో ఒకటి మిత్రపక్షమైన మజ్లీస్‌కు విడిచిపెట్టి మిగిలిన 16 స్థానాలకు ఎలాగూ పోటీ చేస్తుంది. ఈసారి మహారాష్ట్రలోని 48 లోక్‌సభ స్థానాలకు కూడా పోటీ చేయాలని కేసీఆర్ నిర్ణయించిన్నట్లు తెలుస్తోంది. ఇందుకుగాను బిఆర్ఎస్ మహారాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి కల్వకుంట్ల వంశీధర్ రావు ఆ రాష్ట్రంలోని బిఆర్ఎస్ అభ్యర్ధుల జాబితాను సిద్దం చేస్తునట్లు తెలుస్తోంది.
తెలంగాణ శాసనసభ ఎన్నికలలో బిఆర్ఎస్ ఓడిపోయినప్పటికీ ముందుగా అనుకొన్నట్లే జాతీయ రాజకీయాలలో చొచ్చుకుపోవడమే మంచిదని, ఈ ఓటమి కారణంగా ఇప్పుడు వెనక్కు తగ్గితే ఇంతకాలం మహారాష్ట్రలో చేసిన కృషి అంతా వృధా అవుతుందని, మహారాష్ట్రలో బిఆర్ఎస్ నేతలు నమ్మకం కోల్పోతే పార్టీ విశ్వస్నీయత దెబ్బ తింటుందని కేసీఆర్ చెప్పిన్నట్లు తెలుస్తోంది.
కనుక ముందు నిర్ణయించుకొన్న ప్రకారమే మహారాష్ట్రలో బిఆర్ఎస్ రాజకీయ కార్యక్రమాలు ముమ్మరం చేయాలని కేసీఆర్ సూచించిన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 30న కొల్హాపూర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత వరుసగా షోలాపూర్, ఔరంగాబాద్, బీడ్, వార్ధాలో సభలు నిర్వహించేందుకు బిఆర్ఎస్ సన్నాహాలు చేస్తున్నట్లు తాజా సమాచారం.