
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో విజయశాంతికి ఇంకా సముచిత గౌరవం, పదవి లభించాల్సి ఉంది. రేవంత్ రెడ్డి ఆమెను గుర్తుంచుకొన్నారో లేదో తెలీదు కానీ ఆమె కాంగ్రెస్ తరపున మాజీ సిఎం కేసీఆర్కు, బిఆర్ఎస్ పార్టీకి సోషల్ మీడియాలో తరచూ చురకలు వేస్తూనే ఉన్నారు. ఆమె తాజా ట్వీట్లో, బిఆర్ఎస్ పార్టీని శివలింగంపై తేలుతో పోల్చారు.
దానిని చెప్పుతో కొట్టలేము... చేత్తో పట్టుకొని బయటపడేయలేన్నట్లే తెలంగాణ అనే శివలింగంపై కూర్చోన్న బిఆర్ఎస్ పార్టీని కూడా ఇంతకాలం ఎవరూ ఏమీ చేయలేకపోయారు. కానీ ఆయన ఎప్పుడైతే టిఆర్ఎస్ వద్దనుకొని పార్టీ పేరును బిఆర్ఎస్గా మార్చుకొన్నారో అప్పుడే తెలంగాణ ప్రజలు శివలింగంపై ఉన్న ఆ తెలుని తొలగించేశారు.
ఇప్పుడు బిఆర్ఎస్ అంటే భావి రాజకీయ శూన్యత లేదా భవిష్యత్ రాజకేయమ్ సున్నా,” అంటూ విజయశాంతి వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.