దేశంలో బీజేపీని, ప్రధాని నరేంద్రమోడీని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్‌తో సహా 28 పార్టీలు ఇండియా (కూటమి)ని ఏర్పాటు చేసుకొన్న సంగతి తెలిసిందే. మంగళవారం ఢిల్లీలో ఈ కూటమి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భాగస్వామిగా ఉన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరికొన్ని పార్టీల నేతలు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేని కూటమి ప్రధాని అభ్యర్ధిగా నిలబడాలని కోరారు. కానీ ఖర్గే ఈ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారు.
లోక్‌సభ ఎన్నికలలో గెలవడంపైనే అందరూ దృష్టి పెట్టి పనిచేయాలని సూచించారు.మరికొన్ని సమావేశాలలో చర్చించిన తర్వాత కూటమి ప్రధాని అభ్యర్ధిపై తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు.
నిన్న జరిగిన కూటమి సమావేశంలో భాగస్వామ్య పార్టీలన్నీ జనవరి 15లోగా రాష్ట్ర స్థాయిలో సీట్ల సర్దుబాట్లు చేసుకోవాలని ఈ విషయంలో ఎక్కడైనా ప్రతిష్టంభన ఏర్పడితే ఇండియా కూటమి స్టీరింగ్ కమిటీ వాటిపై చర్చించి తీసుకొనే నిర్ణయానికి అన్ని పార్టీలు కట్టుబడి ఉండాలని నిర్ణయించారు.
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ 300 లోక్‌సభ స్థానాలకు పోటీ చేయాలని మమతా బెనర్జీ ప్రతిపాదించారు. దీనికి కాంగ్రెస్ సానుకూలంగా స్పందించింది.