సింగరేణి ఎన్నికలు మార్చికి వాయిదా?

సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు ఈ నెల 27న జరుగవలసి ఉంది. అయితే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కుదురుకోవడానికి కొంత సమయం పడుతుంది కనుక మార్చి వరకు వాయిదా వేయాలని కోరుతూ ప్రభుత్వం తరపు న్యాయవాది నేడు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దానిపై విచారణ చేపట్టినప్పుడు, ఇది వరకు ఎన్నికలు నిర్వహించాలనుకొన్నప్పుడు శాసనసభ ఎన్నికల తర్వాత నిర్వహించాలని ప్రస్తుతం అధికారంలోకి వచ్చినవారే కోరారు. ఇప్పుడు మరోసారి మార్చి వరకు వాయిదా వేయమని కోరుతున్నారు. 

ఇదివరకు వాయిదా కోరినప్పుడు శాసనసభ ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా సింగరేణి ఎన్నికలు నిర్వహించాలని మీరే కోరారు కదా?మార్చిలో  లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వస్తుంది కదా? అప్పుడు మళ్ళీ వాయిదా వేయమని అడుగుతారా?”అంటూ హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని కోరుతూ ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.