భట్టి విక్రమార్కకు రాజభోగమే.. ప్రజాభవన్‌లో మకాం!

ఇంతకాలం తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక నివాసంగా వినియోగించిన ప్రజాభవన్‌లో ఇక నుంచి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నివసించబోతున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదివరకు సీఎల్పీ నేతగా ఉన్న భట్టి విక్రమార్కను ఏనాడూ ప్రజాభవన్‌లోకి కేసీఆర్‌ అనుమతించలేదు. కానీ ఇప్పుడు కేసీఆర్‌ దానిని ఖాళీ చేసి బయటకు వెళ్ళిపోవలసి వచ్చింది. దానిలో ఇప్పుడు భట్టి విక్రమార్క దర్జాగా తన కుటుంబంతో కలిసి ఉండబోతున్నారు. బహుశః కేసీఆర్‌, బిఆర్ఎస్ నేతలు ఎవరూ కూడా ఇటువంటి పరిణామాలు ఊహించి ఉండరేమో? 

 సిఎం రేవంత్‌ రెడ్డి తన క్యాంప్ కార్యాలయం కొరకు జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి సమీపంలో గల డా. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల శిక్షణ కేంద్రంలో ఏర్పాటు చేసుకోబోతున్నారు. దీనిపై అధికారులు నివేదిక సమర్పించిన తర్వాత శిక్షణా కేంద్రాన్ని వేరే చోటికి తరలించి, సిఎం క్యాంప్ కార్యాలయంగా మార్చేయబోతున్నారు.