
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొదటిసారిగా కొందరు ఐపిఎస్ అధికారులను బదిలీలు చేసింది. హైదరాబాద్ సిపి సీవీ ఆనంద్ స్థానంలో కొత్తకోట ప్రభాకర్ రెడ్డి నియమితులయ్యారు. రాచకొండ సిపిగా సుధీర్ బాబు, సైబరాబాద్ సిపిగా అవినాష్ మహంతి నియమితులయ్యారు.
పాతబస్తీ సిపి శాండిల్యని తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టరుగా నియమించింది. సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర, రాచకొండ సిపి చౌహాన్లను డిజిపి కార్యాలయంలో రిపోర్ట్ చేయవలసిందిగా ప్రభుత్వం ఆదేశించింది.
పోలింగ్ ఫలితాలు వెలువడుతున్నప్పుడు రేవంత్ రెడ్డిని కలిసి అభినందనలు తెలిపి ఎన్నికల నియామవళి ఉల్లంఘించారనే కారణంతో సస్పెండ్ అయిన మాజీ డీజీపీ అంజని కుమార్ వివరణ ఇచ్చుకొని క్షమాపణ చెప్పుకోవడంతో కేంద్ర ఎన్నికల కమీషన్ ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు ఇంకా ఏ పదవిలో నియమిస్తుందో తెలియవలసి ఉంది.