ఒడిశా కాంగ్రెస్‌ ఎంపీ కంపెనీలో రూ.353 కోట్లు స్వాధీనం

ఒడిశా కాంగ్రెస్‌ ఎంపీ ధీరజ్ సాహుకి చెందిన ఓ డిస్టీలరీ కంపెనీపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేసి ఏకంగా రూ.353 కోట్లు నగదు స్వాధీనం చేసుకొన్నారు. 50మండి బ్యాంక్ అధికారులు 5 రోజుల పాటు 40 కౌంటింగ్ మెషిన్లతో ఆ సొమ్ముని లెక్కించాల్సి వచ్చిది.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇంతవరకు ఎక్కడా ఇంత సొమ్ము పట్టబడలేదు. కాంగ్రెస్‌, కరెప్షన్ ఒకే నాణేనికి రెండు ముఖాలవంటివని దీంతో మరోసారి స్పష్టమైంది.

తమ కాంగ్రెస్‌ ఎంపీ కంపెనీలో ఇంత భారీగా నగదు పట్టుబడటంపై ఆ పార్టీ పెద్దలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే స్పందించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఇండియా కూటమిలో భాగస్వామ్య పార్టీలు కూడా దీనిపై స్పందించాలని కోరుతున్నాము. 

ఇదివరకు మోడీ ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేసినప్పుడు, దేశవ్యాప్తంగా భారీగా నల్లధనం బయటపడుతున్నప్పుడు, ఇదే ధీరజ్ సాహు స్పందిస్తూ, “దేశంలో ఇంత అవినీతి, ఇంత నల్లధనం చూస్తుంటే నా హృదయం బరువెక్కుతోంది. అసలు ఇంత నల్లధనం ఎలా పోగు చేస్తారో? అర్దంకావడం లేదు. దేశంలో ఈ అవినీతి, నల్లధనం తుడిచిపెట్టేయాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావలసిన అవసరం ఉంది,” అని ధీరజ్ సాహు ట్వీట్ చేశారు. ఇప్పుడు బీజేపీ నేతలు దానినే రీట్వీట్ చేస్తూ ఇప్పుడు ఏమంటారు? అని నిలదీస్తున్నారు.