తెలంగాణ శాసనసభ స్పీకరుగా గడ్డం ప్రసాద్ కుమార్‌

 ఈరోజు మధ్యాహ్నం ఎల్బీ స్టేడియంలో రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అలాగే ఉత్తమ్ కుమార్‌ రెడ్డి, భట్టి విక్రమార్క తదితరులు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. భట్టి విక్రమార్కకు అదనంగా ఉప ముఖ్యమంత్రి పదవి కూడా లభించింది. ఈరోజు సాయంత్రం లేదా రేపు మధ్యాహ్నంలోగా మంత్రుల శాఖలు కూడా తెలుస్తాయి. తెలంగాణ శాసనసభ స్పీకరుగా వికారాబాద్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్‌ని కాంగ్రెస్‌ అధిష్టానం ఖరారు చేసింది. 

గడ్డం ప్రసాద్ కుమార్‌ స్వస్థలం తాండూర్ మండలంలోని బెల్కటూర్. కిరణ్ కుమార్‌ రెడ్డి మంత్రివర్గంలో ఈయన టెక్స్ టైల్ శాఖ మంత్రిగా పనిచేశారు. 2014,2018 ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి తెలంగాణ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడుగా వ్యవహరిస్తున్నారు. తాజా ఎన్నికలలో గెలవడంతో శాసనసభ స్పీకర్ పదవి లభించింది.