సింగరేణి ఎన్నికలు డిసెంబర్‌ 27న

ఈ నెల 27వ తేదీన సింగరేణి గుర్తింపు కార్మికుల సంఘం ఎన్నికలు జరుపబోతున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ డెప్యూటీ చీఫ్ కమీషనర్ డి.శ్రీనివాసులు తెలియజేశారు.

సింగరేణిలోని 13 కార్మిక సంఘాల నేతలతో ఆయన హైదరాబాద్‌లోని కార్మికశాఖ కార్యాలయంలో సోమవారం సమావేశమయ్యి ఎన్నికల గురించి చర్చించి హైకోర్టు ఆదేశం ప్రకారం 27న ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు.

శాసనసభ ఎన్నికలకు ముందే ఎన్నికలు నిర్వహించాలనుకొన్నప్పటికీ కాంగ్రెస్‌ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దానిపై విచారణ జరిపిన హైకోర్టు శాసనసభ ఎన్నికలు ముగిసిన తర్వాత సింగరేణి ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. 

తెలంగాణలో ఆరు జిల్లాలలో వ్యాపించి ఉన్న సింగరేణి బొగ్గు గనులలో ఓటు హక్కు కలిగిన 39,748 మంది కార్మికులు, ఉద్యోగులు ఉన్నారు. 

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కనుక సింగరేణి కార్మికులు కూడా అధికార పార్టీకి అనుబంద సంఘానే ఎన్నుకొనే అవకాశం ఉంటుంది.