తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ గెలిచి త్వరలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుండటంతో, వివిద శాఖలు, కార్పొరేషన్లకు చెందిన పలువురు ఉన్నతాధికారులు, చైర్మన్లు తమ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు.
ముందుగా టిఎస్ ట్రాన్స్కో, జెన్ కో సీఎండీ ప్రభాకరరావు తన పదవికి రాజీనామా చేశారు. ఇంధనశాఖ ప్రధాన కార్యదర్శికి పంపిన ఆ లేఖలో వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ప్రభాకరరావు పేర్కొన్నారు.
టాస్క్ ఫోర్స్ స్పెషల్ ఓఎస్డీ రాధాకిషన్ రావు, ఇంటెలిజన్స్ బ్యూరో ఓఎస్డీ ప్రభాకర్ రావు తమ పదవులకు రాజీనామాలు చేసి వాటిని సిఎస్ శాంతికుమారికి పంపించారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ తన పదవికి రాజీనామా చేశారు.
రాజీనామాలు చేసిన కార్పొరేషన్ చైర్మన్లు వీరే...
• జూలూరి గౌరి శంకర్: తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్
• ఎం.రాజీవ్ సాగర్: టెక్స్ టైల్ కార్పొరేషన్ ఛైర్మన్
• సోమ భరత్ కుమార్: రాష్ట్ర డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్
• డా.ఆంజనేయ గౌడ్: స్పోర్ట్స్ ఆధారిటీ ఛైర్మన్
• డా.ఎర్రోళ్ళ శ్రీనివాస్: రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ఛైర్మన్
• జగన్మోహన్ రావు: టెక్నాలజీస్ సర్వీసెస్ ఛైర్మన్
• రామచంద్ర నాయక్: ట్రైకార్ ఛైర్మన్
• రవీందర్ సింగ్: పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్
• అనిల్ కూర్మాచలం: ఫిలిమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్
• జి.ప్రవీణ్ కుమార్: ఫుడ్ కార్పొరేషన్ ఛైర్మన్
• గజ్జెల నగేష్: తెలంగాణ బేవరెజెస్ కార్పొరేషన్ ఛైర్మన్
• పల్లె రవికుమార్ గౌడ్: రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ ఛైర్మన్
• డి.బాలరాజు యాదవ్: గొర్రెలు,మేకల అభివృద్ధి సంస్థ ఛైర్మన్