బర్రెలక్క ఓటమి ఏం చెపుతోందంటే....

తెలంగాణ అంతటా బర్రెలక్కగా పేరు సంపాదించుకొన్న కర్నే శిరీష నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈసారి ఎన్నికలలో ఆమె తీవ్ర రాజకీయ ఒత్తిళ్ళు, భౌతిక దాడులు కూడా తట్టుకొని చివరివరకు పోటీలో నిలిచారు.

ఆమె తరపున పలువురు ప్రముఖులు వచ్చి ఎన్నికల ప్రచారం చేసినప్పటికీ ఎన్నికలను డబ్బు, అధికారం, యంత్రాంగం శాసిస్తున్న కారణంగా ఆమె ఓడిపోయారు. ఆమెకు కేవలం 5,754 ఓట్లు మాత్రమే లభించాయి.

అయితే ఇది ఆమె ఓటమి కాదు. ప్రజాస్వామ్యం ఓడిపోయిందని చెప్పవచ్చు. ఓ సామాన్య అభ్యర్ధి ఎన్నికలలో పోటీ చేసి నిలద్రొక్కుకోలేని పరిస్థితి కల్పించిన రాజకీయ పార్టీలనే ఇందుకు నిందించాల్సి ఉంటుంది. ఆమె ఓటమితో సామాన్యులు ఎవరూ ఎన్నికలలో పోటీ చేయరాదని చేస్తే ఎటువంటి ఇబ్బందులు, ఫలితాలు వస్తాయో ఈ ఎన్నికలు మరోసారి అందరికీ తెలియజేసిన్నట్లు భావించవచ్చు.