ఓడినందుకు బాధలేదు కానీ నిరాశ చెందాము: కేటీఆర్‌

బిఆర్ఎస్ పార్టీ వర్కిగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ పార్టీ ఓటమిని అంగీకరిస్తూ ట్వీట్ చేశారు. “వరుసగా రెండుసార్లు ప్రభుత్వ ఏర్పాటుకి మాకు అవకాశం ఇచ్చినందుకు తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు. నేడు వస్తున్న ఈ ఫలితాలతో బాధపడటం లేదు కానీ మేము ఊహించిన దానికి భిన్నంగా ఫలితాలు వచ్చినందుకు నిరాశ చెందాను. ఈ ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకొని మళ్ళీ రెట్టింపు శక్తితో తిరిగివస్తాము. ఎన్నికలలో గెలిచినందుకు కాంగ్రెస్ పార్టీకి అభినందనలు. శుభాకాంక్షలు,” అని కేటీఆర్‌ ట్వీట్ చేశారు.