కాంగ్రెస్‌ ఖాతాలో తొలి విజయం అశ్వారావు పేట నుంచే

తెలంగాణ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్‌ విజయం సాధించడం దాదాపు ఖాయం అయ్యింది. మధ్యాహ్నం 11 గంటల వరకు పూర్తయిన ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్‌ 63 స్థానాలలో ఆదిక్యం సాధించగా బిఆర్ఎస్ 40, బీజేపీ 10, ఇతరులు 5 స్థానాలలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

కాంగ్రెస్‌ పార్టీ ఖాతాలో అశ్వారావు పేట నుంచి తొలి విజయం నమోదైంది. అక్కడి నుంచి పోటీ చేసిన ఆది నారాయణ రెడ్డి బిఆర్ఎస్ అభ్యర్ధి నాగేశ్వరరావుపై విజయం సాధించారు.  ఆయన తర్వాత కొత్తగూడెం జిల్లాలోనే ఇల్లెందు కాంగ్రెస్‌ అభ్యర్ధి కోరం కనకయ్య బిఆర్ఎస్ అభ్యర్ధి హరిప్రియా నాయక్‌పై విజయం సాధించారు.