తెలంగాణ ఎన్నికల ఫలితాలు @ ఉదయం 9 గంటలకు

తెలంగాణతో సహా 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈరోజు ఉదయం 8 గంటలకు మొదలైంది. ఆనవాయితీ ప్రకారం ముందుగా పోస్టల్ బ్యాలెట్ పత్రాలను తెరిచి లెక్కిస్తున్నారు. 

పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కాంగ్రెస్‌ అభ్యర్ధులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (నల్గొండ), కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (మునుగోడు), భట్టి విక్రమార్క (మధిర), రేవూరి ప్రకాష్ రెడ్డి (పరకాల), పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (పాలేరు), తుమ్మల నాగేశ్వరరావు (ఖమ్మం), రేవంత్‌ రెడ్డి (కొడంగల్‌), వినోద్ (బెల్లంపల్లి), ప్రేమ్ సాగర్ (మంచిర్యాల) కెఆర్ నాగరాజు (వర్ధన్న పేట) ఆధిక్యంలో సాగుతున్నారు. చాంద్రాయణగుట్టలో మజ్లీస్‌ అభ్యర్ధి అక్బరుద్దీన్ ఓవైసీ, కామారెడ్డిలో బిజెపి అభ్యర్ధి వెంకట రమణా రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఖమ్మంలో 9 స్థానాలలో కాంగ్రెస్‌, ఒక చోట సీపీఎం ఆధిక్యతలో ఉన్నాయి.