తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు ఈరోజు ఉదయం 8 గంటల నుంచి మొదలైంది. ఈసారి కాంగ్రెస్ చేతిలో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందని సర్వేలన్నీ తేల్చిచెప్పేశాయి. దీంతో బిఆర్ఎస్ శ్రేణులు తీవ్ర నిరాశనిస్పృహలలో మునిగిపోయాయి.
కానీ బిఆర్ఎస్ పార్టీ మరోసారి గెలిచి మళ్ళీ అధికారంలోకి వస్తుందని సిఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు నమ్మకంగా చెపుతున్నారు. బిఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ హ్యాట్రిక్ సాధించబోతున్నారని సూచిస్తూ కేటీఆర్ “హ్యాట్రిక్ లోడింగ్ 3.0 సంబురాలు చేసుకొనేందుకు సిద్దంగా ఉండండి,” అంటూ ట్వీట్ చేశారు. దాంతో పాటు తుపాకి గురి పెట్టి చూస్తున్న తన ఫోటోని కూడా జత చేశారు.
మరి కేసీఆర్, బిఆర్ఎస్ పార్టీ నిజంగానే హ్యాట్రిక్ చేయబోతున్నారా లేక నేటితో అందరూ మాజీలుగా మారబోతున్నారా అనేది ఈరోజు సాయంత్రంలోగా తేలిపోనుంది. కనుక తెలంగాణతో పాటు ఆంధ్రా ప్రజలు కూడా ఈన్నికల ఫలితాల కోసం ఆసక్తిగా చూస్తున్నారు.