
ఈసారి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి రాబోతోందని సర్వేలు తేల్చి చెప్పేశాయి. సహజంగానే ఇది బిఆర్ఎస్లో అందరికీ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కానీ కేసీఆర్ మాత్రం మళ్ళీ మనమే గెలిచి అధికారంలోకి రాబోతున్నామని కనుక ఈ ఎగ్జిట్ పోల్ నివేదికలను చూసి ఆందోళన చెందవద్దని పార్టీలో అందరికీ ధైర్యం చెప్పారు.
అంతే కాదు... డిసెంబర్ 4వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో మంత్రివర్గ సమావేశం నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం అధికారిక ప్రకటన కూడా చేసింది.
ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీగెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందని సర్వేలన్నీ చెపుతున్నప్పుడు, ఫలితాలు వెలువడక మునుపే కేసీఆర్ డిసెంబర్ 4న మంత్రివర్గ సమావేశం ముహూర్తం పెట్టడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇది కేసీఆర్ ఆత్మవిశ్వాసమా లేక అతివిశ్వాసమా?బిఐఎస్ ఓడిపోతుందని సర్వేలన్నీ ముక్త కంఠంతో తేల్చి చెప్పేశాయి. కానీ తమ పార్టీ 70-72 సీట్లు గెలుచుకొని అధికారంలోకి వస్తామని మంత్రి కేటీఆర్ చెపుతున్నారు. కనుక డిసెంబర్ 3న ఫలితాలు వచ్చాక అసలు సిసలైన రాజకీయ చదరంగం మొదలవుతుంది.