భారీ మెజార్టీతో బిఆర్ఎస్ గెలుపు ఖాయం!

గురువారం పోలింగ్‌ పూర్తవగానే పలు సంస్థలు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతోందంటూ సర్వే నివేదికలు ప్రకటించాయి. తాజాగా వాట్సప్ గ్రూపులలో మంచి పేరున్న ‘తెలుగు స్క్రైబ్’ కూడా తెలంగాణ ఓటరు నాడీ తెలుసుకొనేందుకు ఆన్‌లైన్‌లో ఓ సర్వే (ఒపీనియన్ పోల్) నిర్వహించి ఆ నివేదికను ప్రకటించింది. ఈ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ 73-77 సీట్లు గెలుచుకోబోతున్నట్లు తెలియజేసింది. బిఆర్ఎస్ పార్టీకి 42.18% ఓటు షేర్ లభిస్తుందని తెలిపింది. 

కాంగ్రెస్ పార్టీకి కేవలం 28-32 సీట్లు (33.4% ఓట్ షేర్), మజ్లీస్‌: 6-7 సీట్లు (2.5%), బీజేపీ: 4-6 సీట్లు (13.82%), ఇతరులకు 1-3 సీట్లు (8.1%) దక్కబోతున్నాయని తెలియజేసింది. 

ఆ నివేదిక ప్రకారం కరీంనగర్‌లో బండి సంజయ్‌, ములుగులో సీతక్క, మల్కాజ్‌గిరిలో మైనంపల్లి హన్మంతరావు, మెదక్‌లో మైనంపల్లి రోహిత్, మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓడిపోయే అవకాశాలున్నాయని తెలియజేసింది. 

అలాగే రేవంత్‌ రెడ్డి (కొడంగల్‌), కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (నల్గొండ), ఈటల రాజేందర్‌ (హుజూరాబాద్‌), భట్టి విక్రమార్క (మధిర), జగ్గారెడ్డి (సంగారెడ్డి)లో గట్టి పోటీ ఎదుర్కొంటున్నారని తెలిపింది.