సంబంధిత వార్తలు
మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌ఘడ్, మిజోరాం శాసనసభ ఎన్నికల ఫలితాలపై వివిద మీడియా, సర్వే సంస్థలు తమ అంచనాలను ప్రకటించాయి. వాటి ప్రకారం బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉండగా, కాంగ్రెస్ పాలిత ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో ఆ రెండు పార్టీలకు ఇంచుమించు సమానంగా సీట్లు రావచ్చని పేర్కొన్నాయి. కాంగ్రెస్ పాలిత రాజస్థాన్ కూడా ఈసారి కాంగ్రెస్ చేజారి బీజేపీకి దక్కే అవకాశం ఉందని పేర్కొన్నాయి. మిజోరాంలో కాంగ్రెస్‌తో కూడిన ఎంఎన్ఎఫ్ కూటమి గెలిచి అధికారంలోకి రావచ్చని పేర్కొన్నాయి.