ఈసారి తెలంగాణ శాసనసభ ఎన్నికలలో 70.66 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. అయితే ఈరోజు ఖచ్చితమైన వివరాలు తెలియజేస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. 2014 ఎన్నికలలో 69.5%, 2018 ఎన్నికలలో 73.2% పోలింగ్ నమోదు కాగా ఈసారి కాస్త తగ్గింది.
రాష్ట్రంలో అత్యధికంగా మునుగోడు నియోజకవర్గంలో 91.51% పోలింగ్ నమోదు కాగా, అత్యల్పంగా గ్రేటర్ పరిధిలోని యాకుత్ పురాలో 39.69% నమోదైంది. ములుగు జిల్లాలో ఆదివాసీలు దట్టమైన అడవుల గుండా సుమారు 16 కిమీ కాలినడకన నడిచి పోలింగ్ కేంద్రాలకు చేరుకొని తమ ఓటు హక్కు వినియోగించుకొన్నారు. అదే... హైదరాబాద్లో విద్యావంతులైన ఓటర్లు తమకు అతి సమీపంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి వెళ్ళేందుకు బద్దకించి ఓట్లు వేయలేదు.