తెలంగాణ శాసనసభ ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నం వరకు చాలా మెల్లగా సాగినప్పటికీ 2 గంటల నుంచి వేగం పుంజుకొంది. మావోయిస్ట్ ప్రభావిత సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి. మంచిర్యాల, ఆసిఫాబాద్, మంధాని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం 13 నియోజకవర్గాలలో మరికొద్ది సేపటిలో అంటే 4 గంటలకు పోలింగ్ ముగియనుంది. మిగిలిన 106 నియోజకవర్గాలలో కూడా మరో గంటలో అంటే సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియబోతోంది. కనుక ఓటర్లు హడావుడిగా పోలింగ్ బూత్‌లకు చేరుకొని క్యూ కడుతున్నారు.
మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా 51.89 శాతం పోలింగ్ నమోదైంది. జిల్లాలవారీగా నమోదైన పోలింగ్ శాతం ఈవిదంగా ఉంది...