కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై ఈసీ సీరియస్

హుజూరాబాద్‌ బిఆర్ఎస్ అభ్యర్ధి పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల కమీషన్‌ నివేదిక ఇవ్వాలని హుజూరాబాద్‌ ఎన్నికల అధికారులని ఆదేశించింది. ఆయన నిన్న (మంగళవారం) ప్రచారం ముగింపు సమయంలో ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ఈ ఎన్నికలలో నన్ను గెలిపించి కాపాడుకోంటారో లేదా ఓడించి చంపుకొంటారో మీ చేతుల్లోనే ఉంది. గెలిస్తే డిసెంబర్‌ 4న విజయయాత్రలో కలుద్దాం లేకుండా ఆదేరోజున మా కుటుంబం శవయాత్రకు అందరూ రండి,” అని అన్నారు. 

ఇది ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి ఓటర్లను బ్లాక్ మెయిల్ చేయడమేనని, కనుక పాడి కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎన్‌ఎస్‌యుఐ నాయకుడు బల్మూరి వెంకట్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఆ పిర్యాదుపై వెంటనే స్పందించి, నివేదిక సమర్పించాల్సిందిగా హుజూరాబాద్‌ ఎన్నికల అధికారులని ఆదేశించింది.