సంబంధిత వార్తలు
మిర్యాలగూడ కాంగ్రెస్ అభ్యర్ధి బత్తుల లక్ష్మారెడ్డి తల్లి వెంకట్రామమ్మ (80) ఈరోజు ఉదయం కన్నుమూశారు. ఆమె గత కొంతకాలంగా వృద్ధాప్య సంబందిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
రేపు సాయంత్రంతో ఎన్నికల ప్రచారం గడువు ముగుస్తుంది కనుక ఎన్నికల ప్రచారంలో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న లక్ష్మారెడ్డికి తల్లి మరణవార్త తెలియడంతో ప్రచారం మద్యలో నిలిపివేసుకొని హుటాహుటిన ఇంటికి చేరుకొన్నారు. ఈ ఎన్నికలలో తప్పకుండా గెలిచి తల్లిని సంతోషపెట్టాలనుకొన్న బత్తుల లక్ష్మారెడ్డి ఇప్పుడు ఆమె అంత్యక్రియలు చేస్తున్నారు. ఆయన తరపున కాంగ్రెస్ నేతలు, ఆయన అనుచరులు ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.