ఈసారి కూడా బిఆర్ఎస్ పార్టీ విజయం: రాజనీతి

ఈసారి తెలంగాణ శాసనసభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్‌ గట్టి పోటీ ఇస్తుండటంతో రెండు పార్టీలలో ఏది గెలుస్తుందని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ప్రముఖ సర్వే సంస్థ రాజనీతి తాజా సర్వేలో బిఆర్ఎస్ పార్టీయే గెలిచి మళ్ళీ అధికారంలోకి రాబోతోందని తేల్చి చెప్పింది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ గాలి బలంగా వీస్తున్నప్పటికీ, ప్రజలు కాంగ్రెస్ పార్టీ వాగ్ధానాలను నమ్మడంలేదని కనుక బిఆర్ఎస్ పార్టీవైపే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారని తెలిపింది. 

రాష్ట్రంలో 119 నియోజకవర్గాలలో అన్ని వర్గాలకు చెందిన 38,351 మందిని ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రశ్నించి ఓటర్ల నాడి తెలుసుకొన్నామని రాజనీతి సంస్థ పేర్కొంది.