జి.వివేక్‌పై ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు

చెన్నూరు కాంగ్రెస్‌ అభ్యర్ధి గడ్డం వివేకానందపై ఈడీ మనీలండరింగ్ కేసు నమోదు చేసిన్నట్లు ప్రెస్‌నోట్‌ ద్వారా తెలియజేసింది. రెండు రోజులుగా ఆయన ఇళ్ళు, కార్యాలయాలలో సోదాలు జరిపిన ఈడీ అధికారులు, ఆయన కుటుంబానికి చెందిన విజిలన్స్ సెక్యూరిటీ సర్వీసస్ ప్రైవేట్ లిమిటెడ్, విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్, వాటి మాతృ సంస్థ యశ్వంత్ రియాల్టర్స్ మద్య జరిగిన ఆర్ధిక లావాదేవీలను పరిశీలించిన మీదట, సుమారు రూ.200 కోట్లు మనీ లాండరింగ్ జరిగిన్నట్లు గుర్తించారు. వాటికి సంబందించిన రికార్డులను స్వాధీనం చేసుకొన్నట్లు తెలిపింది. 

ఇటీవల హైదరాబాద్‌లో పోలీసులు తనికీలు చేస్తున్నప్పుడు విజిలన్స్ సెక్యూరిటీ సర్వీసస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన వాహనంలో రూ.8 కోట్లు తరలిస్తుండగా పట్టుబడింది. దాని ఆధారంగా దర్యాప్తు జరుపగా ఏకంగా రూ.200 కోట్ల అక్రమ లావాదేవీలు జరిగిన్నట్లు గుర్తించామని ఈడీ పేర్కొంది. జి.వివేక్, ఆయన భార్యకు చెందిన ఈ మూడు కంపెనీలు ఫెమా నిబందనలు ఉల్లంఘించిన్నట్లు తెలిపింది. కనుక జి.వివేకానంద, ఆయన కంపెనీలపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసిన్నట్లు ఈడీ తెలిపింది. 

మరో వారంలో పోలింగ్ జరుగబోతుండగా తమ పార్టీ అభ్యర్ధుల ఇళ్ళపై ఈడీ దాడులు చేసి కేసులు నమోదు చేయడం రాజకీయంగా వారిపై ఒత్తిడి చేసి లొంగదీసుకొనే ప్రయత్నమే అని కాంగ్రెస్‌ వాదిస్తోంది.              

Image