ఈసారి తెలంగాణ శాసనసభ ఎన్నికలలో బీజేపీతో పొత్తు పెట్టుకొని జనసేన 8 స్థానాల నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. కనుక జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బీజేపీ, జనసేన అభ్యర్ధులకు మద్దతుగా నేడు, రేపు (బుధ, గురువారం) ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నట్లు జనసేన ప్రకటించింది.
వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్ధులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు, రావు పద్మల తరపున ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఎన్నికల ప్రచారం చేయబోతున్నారు.
రేపు (గురువారం) ఉదయం 11 గంటలకు కొత్తగూడెం, మధ్యాహ్నం 2 గంటలకు సూర్యపేట, సాయంత్రం 4.30 గంటలకు దుబ్బాకలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు.
కొత్తగూడెం నుంచి ఎల్.సురేందర్ రావు (జనసేన), సూర్యాపేట నుంచి సంకినేని వేంకటేశ్వర రావు (బీజేపీ), దుబ్బాక నుంచి రఘునందన్ రావు (బీజేపీ) పోటీ చేస్తున్నారు. వారికి మద్దతుగా పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం చేయనున్నారు.
తాండూరు నుంచి పోటీ చేస్తున్న జనసేన అభ్యర్ధి శంకర్ గౌడ్ తరపున ఈ నెల 25న, కూకట్‌పల్లి జనసేన అభ్యర్ధి ప్రేమ్ కుమార్ తరపున 26న పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం చేయనున్నారు.