కోదండరామ్‌కు రాజ్యసభ సీటు హామీ లభించిందా?

ఈసారి ఎన్నికలలో తెలంగాణ జనసమితి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని ఏడు నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని భావించింది. కానీ చర్చల తర్వాత ఎన్నికల బరిలో నుంచి వెనక్కు తగ్గి కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు.

ఇందుకు ప్రతిగా ఎన్నికల తర్వాత ప్రొఫెసర్ కోదండరామ్‌ను కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపిస్తామని, ఆయన కోరిన్నట్లుగా తెలంగాణలో టిజెఎస్ పార్టీకి రెండు ఎమ్మెల్సీ, 5 కార్పొరేషన్ పదవులు ఇచ్చేందుకు కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చిన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చి పార్టీని కాపాడుకోవడం మంచి నిర్ణయమే అని చెప్పవచ్చు. 

ప్రొఫెసర్ కోదండరామ్‌ తెలంగాణ ఉద్యమాలలో కేసీఆర్‌తో సమానంగా ముందుండి పోరాడినప్పటికీ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆయనను కేసీఆర్‌ పట్టించుకోలేదు. ఉద్యమకారుడుగా ప్రొఫెసర్ కోదండరామ్‌కి కేసీఆర్‌ ప్రభుత్వం తగిన గౌరవం, ప్రాధాన్యత ఇవ్వకపోగా తెలంగాణ సమాజంలో ఆయన ప్రాధాన్యత తగ్గేలా చేశారని అందరికీ తెలుసు. ఇంకా అనేక కారణాల చేత ప్రొఫెసర్ కోదండరామ్‌ కేసీఆర్‌ని వ్యతిరేకిస్తున్నారు. ఆ వ్యతిరేకతే నేడు కాంగ్రెస్ పార్టీకి చేరువయ్యేలా చేసిందని చెప్పవచ్చు.