
సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ఎల్బీ నగర్ కాంగ్రెస్ అభ్యర్ధి మధూయాష్కీ గౌడ్ హయాత్ నగర్ నివాసంలో పోలీసులు మంగళవారం అర్దరాత్రి తనికీలు చేశారు. ఆయన ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత నియోజకవర్గంలో ఓటర్లకు పంచిపెట్టేందుకు భారీగా డబ్బు, కానుకలు తన ఇంట్లో నిలువచేశారనే అనుమానంతో తనికీలు చేపట్టిన్నట్లు పోలీసులు తెలిపారు.
అయితే అర్దరాత్రి ఇంట్లో జొరబడి తనికీలు చేయడంపై ఆయన అనుచరులు, కుటుంబ సభ్యులు తీవ్ర అభ్యంతరం చెప్పారు. ఈ సందర్భంగా పోలీసులకి వారికీ తీవ్ర వాగ్వాదం జరిగింది. అయితే తనికీలు చేసిన పోలీసులకు మధూయాష్కీ గౌడ్ ఇంట్లో ఏదీ లభించలేదు.
మధూయాష్కీ గౌడ్ చేతిలో ఓటమి తప్పదనే భయంతోనే ఎల్బీ నగర్ బిఆర్ఎస్ అభ్యర్ధి సుధీర్ రెడ్డి పోలీసులపై ఒత్తిడి చేస్తున్నారని మధూయాష్కీ గౌడ్ అనుచరులు వాదించారు. అయితే బిఆర్ఎస్ పార్టీ ఎన్ని కుట్రలు పన్నినా ఈసారి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిచి ర అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు.