బీజేపీకి తుల ఉమ రాజీనామా చేశారు. ఆమె రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి పంపిన రాజీనామా లేఖలో “బీసీ వర్గానికి చెందిన నాకు టికెట్ ఇస్తున్నట్లు ప్రకటించి బీ-ఫారం ఇవ్వకుండా అవమానించారు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి పార్టీ కోసం ఎంతగానో కష్టపడి పనిచేసిన నన్ను ఈవిదంగా అవమానించినందుకు చాలా బాధపడుతున్నాను. అందుకే రాజీనామా చేస్తున్నాను. నాకు జరిగిన ఈ అన్యాయానికి బీసీలు తప్పకుండా బీజేపీని శిక్షిస్తారు,” అని పేర్కొన్నారు.
ఆమె పార్టీని వీడేందుకు సిద్దమవగానే బిఆర్ఎస్ నేతలు ఆమె ఇంటికి వెళ్ళి తమ పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానించగా ఆమె సానుకూలంగా స్పందించారు. సోమవారం ఆమె మంత్రి కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు. దీంతో వేములవాడలో బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేయబోతున్న వికాస్ రావుకి ఆమెను , బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను వాటి అభ్యర్ధులు సిహెచ్. లక్ష్మీ నరసింహ రావు, ఏ.శ్రీనివాస్‌లను కూడా ఒంటరిగా ఎదుర్కోవలసి ఉంటుంది.