కూకట్‌పల్లిలో రెండు జనసేనలు!

తెలంగాణ శాసనసభ ఎన్నికలలో తొలిసారిగా బీజేపీతో పొత్తు పెట్టుకొని 8 స్థానాలకు పోటీ చేస్తున్న జనసేన పార్టీకి కూకట్‌పల్లి దక్కింది. ఆ సీటుని జనసేనకు ఇవ్వవద్దని స్థానిక బీజేపీ నేతలు ఎంతగా ఒత్తిడి చేసినప్పటికీ దానికే దక్కింది. కనుక స్థానిక బీజేపీ నేతల నుంచి జనసేనకు సహకారం లభించకపోవచ్చు.

అయితే జనసేనకు అంతకంటే పెద్ద సమస్య వచ్చి పడింది. కూకట్‌పల్లి నుంచి జాతీయ జనసేన అనే మరో పార్టీ కూడా పోటీ చేస్తోంది. జనసేన అభ్యర్ధన మేరకు కేంద్ర ఎన్నికల కమీషన్‌ గ్లాసు గుర్తుని కేటాయించింది. కానీ జాతీయ జనసేనకు  ఎన్నికల గుర్తుగా‘బకెట్’ కేటాయించడంతో పార్టీల పేర్లు, ఎన్నికల గుర్తులు ఒకేలా ఉండటంతో జనసేనకు తలనొప్పిగా మారింది. కనుక ఆ పార్టీ అభ్యర్ధికి నచ్చజెప్పి నామినేషన్ ఉపసంహరింపజేసుకొనేందుకు జనసేన నేతలు ప్రయత్నిస్తున్నారు.