తెలంగాణలో 119 సీట్లకు 5,170 నామినేషన్స్‌?

తెలంగాణ శాసనసభ ఎన్నికలలో నామినేషన్స్‌ ప్రక్రియ నిన్న ముగిసింది. మొత్తం 119 స్థానాలకు సుమారు 5,170 నామినేషన్స్‌ దాఖలు అయిన్నట్లు తెలుస్తోంది. పార్టీ టికెట్‌ లభిస్తుందనే నమ్మకంతో కొందరు, టికెట్‌ లభించనందుకు కొందరు, స్వతంత్ర అభ్యర్ధులుగా మరికొందరు నామినేషన్స్‌ వేస్తుంటారు.  ఈ నెల 15వరకు నామినేషన్స్‌ ఉపసంహరణకు గడువు ఉంది. కనుక ఆ తర్వాత బరిలో ఎంతమంది అభ్యర్ధులున్నారో తేలిపోతుంది. 

ఈ నెల 30వ తేదీన పోలింగ్ జరుగుతుంది. డిసెంబర్‌ 3వ తేదీన ఓట్లు లెక్కించి వెంటవెంటనే ఫలితాలు ప్రకటిస్తారు.