
ఈరోజు మధ్యాహ్నం 3 గంటలతో నామినేషన్స్ దాఖలు చేసేందుకు గడువు ముగుస్తుంది. అయినా కాంగ్రెస్, బీజేపీలు అభ్యర్ధులు మారుస్తూనే ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది.నారాయణ్ ఖేడ్ నుంచి సురేష్ షెట్కర్, సంజీవ రెడ్డి పోటీ పడగా వారిలో సురేష్‌కు టికెట్ ఇచ్చింది. కానీ బీ-ఫారం ఇవ్వలేదు. ఈరోజు ఉదయం సంజీవ్ రెడ్డిని అభ్యర్ధిగా ప్రకటించి, బీ-ఫారం ఇవ్వడంతో సురేష్ షాక్ అయ్యారు. నామినేషన్ గడువు ముగుస్తుండటంతో సంజీవ్ రెడ్డి హడావుడిగా రిటర్నింగ్ అధికారి వద్దకు పరుగులు తీశారు.
వేములవాడలో తుల ఉమాని బీజేపీ అభ్యర్ధిగా ప్రకటించింది. కానీ ఈరోజు ఉదయం ఆమె స్థానంలో వికాస్ రావుని ఖరారు చేసి బీ-ఫారం ఇవ్వడంతో ఆమె తీవ్ర మనస్తాపం చెందారు.
కొత్తగూడెం టికెట్ ఆశించిన జలగం వెంకటరావుకి బిఆర్ఎస్ పార్టీ హ్యాండ్ ఇవ్వడంతో ఆయన స్వతంత్ర అభ్యర్ధిగా నామినేషన్ వేశారు.
మజ్లీస్ పార్టీ కూడా చివరి నిమిషంలో రాజేంద్ర నగర్ అభ్యర్ధి రాష్ట్రవ్యాప్తంగా యాదవ్‌ని పక్కన పెట్టి స్వామి యాదవ్‌కి బీ-ఫారం ఇచ్చింది.
పటాన్‌చెరు కాంగ్రెస్ అభ్యర్ధిగా ప్రకటించబడిన నీలం మధుకి హ్యాండ్ ఇవ్వడంతో ఆయన వెంటనే బీఎస్పీలో చేరిపోయి ఆ పార్టీ అభ్యర్ధిగా నేడు నామినేషన్ వేశారు.
మరి కొన్ని నిమిషాలలో నామినేషన్స్ గడువు ముగిసిపోతోంది కనుక ఇక్కడితో ఈ డ్రామాలకు తెరపడుతుంది.