నాంపల్లి, గోషామహల్, ఆలంపూర్ బిఆర్ఎస్ అభ్యర్ధులు వీరే

శాసనసభ ఎన్నికలలో 119 స్థానాలలో 116 మంది బిఆర్ఎస్ అభ్యర్ధులను ప్రకటించినా నాంపల్లి, గోషామహల్, ఆలంపూర్ నియోజకవర్గాలకు మాత్రం అభ్యర్ధులను ప్రకటించలేదు. నామినేషన్స్‌ దాఖలు చేసేందుకు ఇంకా రెండు రోజులు మాత్రమే గడువు ఉండటంతో ఈ మూడు స్థానాలకు కూడా అభ్యర్ధులను ఖరారు చేసింది. 

గోషామహల్ నుంచి నంద కిషోర్, నాంపల్లి నుంచి ఆనంద్ కుమార్‌ గౌడ్, ఆలంపూర్ నుంచి చల్లా వెంకట్రామ్ రెడ్డి అనుచరుడు విజయడుని బిఆర్ఎస్ అభ్యర్ధులుగా కేటీఆర్‌ ప్రకటించి ముగ్గురికీ బి-ఫారమ్స్ కూడా అందజేశారు. దీంతో బిఆర్ఎస్ పార్టీలో 119 స్థానాలకు అభ్యర్ధులు ఖరారు అయ్యింది. ఇప్పటికే వివిద పార్టీల అభ్యర్ధులు నామినేషన్స్‌ దాఖలు చేశారు. ఈసారి గజ్వేల్, కామారెడ్డి నుంచి పోటీ చేయబోతున్న సిఎం కేసీఆర్‌ రేపు తన నామినేషన్స్‌ దాఖలు చేయనున్నారు.