తెలంగాణ 8 స్థానాలలో జనసేన పోటీ

తెలంగాణ శాసనసభ ఎన్నికలలో ఈసారి పవన్‌ కళ్యాణ్‌ అధ్యక్షతన జనసేన పార్టీ కూడా పోటీ చేయబోతోంది. జనసేన తొలుత 32 స్థానాలకు ఒంటరిగా పోటీ చేయాలనుకొన్నప్పటికీ, బీజేపీతో పొత్తులు కుదరడంతో 8 స్థానాల నుంచే పోటీ చేయబోతోంది. జనసేన 8 మంది అభ్యర్ధులను మంగళవారం సాయంత్రం ప్రకటించింది.