మరో సర్వే రిపోర్ట్: కాంగ్రెస్‌ విజయం ఖాయం

తెలంగాణ శాసనసభ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రోజుకో మీడియా సంస్థ ఎన్నికల ఫలితాలు ఏవిదంగా ఉండబోతున్నాయో తెలియజేస్తూ తమ సర్వే నివేదికలను ప్రకటిస్తున్నాయి. జీ న్యూస్, ఇండియా టీవీ, అంతకు ముందు మరికొన్ని మీడియా సంస్థలు ఈసారి కూడా బిఆర్ఎస్ పార్టీయే ఎన్నికలలో గెలిచి, పూర్తి మెజార్టీతో  అధికారంలో రాబోతోందని చెప్పాయి. కానీ బిగ్ టీవి విడుదల చేసిన తాజా నివేదికలో కాంగ్రెస్ పార్టీ 71-76 సీట్లు గెలుచుకోబోతోందని, బిఆర్ఎస్ పార్టీకి కేవలం 34-39 సీట్లు మాత్రమే వస్తాయని జోస్యం చెప్పింది.