కాంగ్రెస్‌ తుది జాబితా విడుదల

తెలంగాణ శాసనసభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ 16 మంది అభ్యర్ధుల తుది జాబితాను సోమవారం రాత్రి విడుదల చేసింది. దానిలో వనపర్తి కాంగ్రెస్‌ అభ్యర్ధి డాక్టర్ జి.చిన్నా రెడ్డి స్థానంలో తూడి మేఘారెడ్డిని, అలాగే భోథ్ అభ్యర్ధి వి అశోక్ స్థానంలో ఆడే గజేందర్‌లను అభ్యర్ధులుగా ఖరారు చేసింది. పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి కామారెడ్డి నుంచి కూడా పోటీ చేయబోతున్నట్లు ప్రకటించింది. దీంతో మొత్తం 119 స్థానాలకు కాంగ్రెస్‌ అభ్యర్ధులను ప్రకటించిన్నట్లయింది.