మళ్ళీ బిఆర్ఎస్ పార్టీకే అధికారం: జీ న్యూస్

తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ఇంకా కేవలం మూడు వారాలే గడువు ఉంది. కనుక మూడు ప్రధాన పార్టీలలో ఏది విజయం సాధించబోతోందనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఈసారి కాంగ్రెస్ పార్టీ పుంజుకొని గట్టి పోటీనిస్తుండటం, బీఎస్పీ, సిపిఎం పార్టీలు కూడా బరిలో దిగి గట్టిపోటీ ఇస్తుండటంతో బిఆర్ఎస్ పార్టీకి ఎదురీత తప్పదని అర్దమవుతూనే ఉంది. అయితే ప్రముఖ మీడియా సంస్థ జీ న్యూస్ రాష్ట్రంలో సర్వే చేసి విడుదల చేసిన తాజా నివేదికలో మళ్ళీ బిఆర్ఎస్ పార్టీయే గెలిచి పూర్తి మెజార్టీతో అధికారంలోకి రాబోతోందని తేల్చి చెప్పిందిఅలాగే ఇండియా టీవీ న్యూస్ చానల్ కూడా బిఆర్ఎస్ పార్టీ పూర్తి మెజార్టీతో అధికారంలోకి రాబోతోందని చెప్పింది.