తెలంగాణ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేయాలని సీపీఎం అనుకొంది. కానీ కనీసం రెండు మూడు సీట్లు కూడా ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీకరించకపోవడంతో సీపీఎం కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పేసి 14 స్థానాలలో ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్దమైంది.
ఆదివారం సీపీఎం పార్టీ 14 మంది అభ్యర్ధులతో తొలి జాబితాను విడుదల చేసింది. సీపీఎం అభ్యర్ధులు వారు పోటీ చేయబోతున్న నియోజకవర్గాల వివరాలు:
పాలేరు: తమ్మినేని వీరభద్రం
ఖమ్మం: ఎర్ర శ్రీకాంత్
మధిర: పాలడుగు భాస్కర్
సత్తుపల్లి: మాచర్ల భారతి
భద్రాచలం: కారం పుల్లయ్య
అశ్వారావుపేట: అర్జున్
మిర్యాలగూడ: జూలకంటి రంగారెడ్డి
వైరా: భూక్యా వీరభద్రం
నకిరేకల్: చినవెంకులు
ఇబ్రహీంపట్నం: యాదయ్య
ముషీరాబాద్: దశరథ్
జనగామ: కనకా రెడ్డి
పటాన్‌చెరు: మల్లికార్జున్
భువనగిరి: నర్సింహ.