సిఎం కేసీఆర్ శనివారం మధ్యాహ్నం సిద్ధిపేట జిల్లాలోని కోనాయిపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని దర్శించుకొని, తన ఎన్నికల నామినేషన్ పత్రాలను స్వామివారి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేశారు.
ఆయనతో పాటు మంత్రి హరీష్ రావు కూడా తన నామినేషన్ పత్రాలను స్వామివారి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేశారు.
కేసీఆర్ ప్రతీ ఎన్నికలలో ముందుగా స్వామివారిని దర్శించుకొన్నాకనే, నామినేషన్స్ వేస్తుంటారు. కనుక ఈసారి కూడా ఆ ఆనవాయితీని పాటించారు. ఈ నెల 9వ తేదీన ఉదయం గజ్వేల్ నియోజకవర్గంలో, అదే రోజు మధ్యాహ్నం కామారెడ్డి నియోజకవర్గంలో కేసీఆర్ నామినేషన్స్ దాఖలు చేయనున్నారు.
కేంద్ర ఎన్నికల కమీషన్ శుక్రవారం తెలంగాణ శాసనసభ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయడంతో అప్పుడే అభ్యర్ధులు నామినేషన్స్ వేయడం ప్రారంభించారు. నామినేషన్స్ వేసేందుకు ఈ నెల 10వరకు గడువు ఉంది. ఈ నెల 30న పోలింగ్ జరుగనుంది. డిసెంబర్ 3న ఓట్ల లెక్కించి వేంటంవెంటనే ఫలితాలు వెల్లడిస్తారు.